మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కకి జనసేన వినతిపత్రం

మధిర, తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో పాల్గొని ఆంగ్లేయులు, నిజాముల మీద తిరుగుబాటు చేసి మనందరికీ స్వేచ్ఛను కల్పించి వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వారి ప్రాణాలు అర్పించిన మహానుభావుల కుటుంబాలను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబానికి పింఛన్ రూపంలో ఆదుకోవాలని వారి కుటుంబంలో వారికి ఉద్యోగం కల్పించాలని, ఈ సమస్యని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి రాష్ట్రంలో సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలను ఆదుకోవాలని జనసేన పార్టీ మధిర నియోజకవర్గం నుండి విన్నవించుకుంటున్నామని తెలిపి వినతిపత్రమివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బోనకల్ మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్, మధిర టౌన్ ఉపాధ్యక్షులు అనంత శివ రామకృష్ణ, బోనకల మండలం ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎస్కే జానీ పాషా, జాన్ తదితరులు పాల్గొన్నారు.