భూ బకాసురులపై చర్యలు తీసుకోవాలని కృత్తివెన్ను ఎమ్మార్వోకి వినతిపత్రమిచ్చిన జనసేన

కృష్ణాజిల్లా, పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామం భూ బకాసురులకు అడ్డాగా మారిపోయింది. మడ అడవులు, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రక్షించవలసిన అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆక్రమణదారులు పోటీపడి మరీ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారన్నారు. నిజాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకునే ఉద్దేశంతో మంగళవారం కృత్తివెన్ను మండలంలో వివిధ గ్రామాలు మరియు ఇంతేరు గ్రామంలో సర్వే నెంబర్ 94లో ఆక్రమణకు గురైన మడ అడవులను చూడడం జరిగింది. అక్కడ చాలా వరకు ఆక్రమణదారులు చెరువులు తవ్వడం జరిగింది. సముద్రానికి 10 మీటర్ల దూరంలో సి ఆర్ జెడ్ ఆంక్షలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారం చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. సామాన్యుడు కరెంట్ మీటర్ కు దరఖాస్తు చేసుకుంటే సవాలక్ష అభ్యంతరాలు చెప్పే విద్యుత్ శాఖ వారు, ఎలాంటి నిబంధనలు పాటించకుండా సి ఆర్ జెడ్ పరిధిలో ఉన్న ఆక్రమణ చెరువులకు ట్రాన్స్ఫార్మర్ పెట్టి మరీ కరెంట్ సప్లై చేయడం ఈ సంఘటనలో అవినీతి ఏ స్థాయిలో ఉందనే దానికి అద్దం పడుతుంది. రెవెన్యూ అధికారులు, అటవీ అధికారుల ఉదాసీన వైఖరి వల్ల భూ బకాసురులు ఇష్టానుసారం చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే, గ్రామాలకు గ్రామాలు సముద్రంలో కలిసి పోయే ప్రమాదం ఉంది. కావున తక్షణమే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన జనసేన పార్టీ ప్రజా పక్షాన పోరాటం చేస్తుంది. మడ అడవులను, ప్రభుత్వ భూములను కాపాడుకోవడానికి జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని సిద్ధం. అన్యాక్రాంతమైన మడ అడవులను, ప్రభుత్వ భూములను కాపాడాలని, భూ బకాసురులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం కృత్తివెన్ను ఎమ్మార్వోకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట, కృత్తివెన్ను మండల అధ్యక్షులు తిరుమని రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి కూనసాని నాగబాబు, తిరుమలశెట్టి చంద్రమౌళి, రాష్ట్ర మత్స్యకార విభాగ శాఖ కార్యదర్శి ఒడుగు ప్రభాస్ రాజు, బంటుమిల్లి మండల అధ్యక్షుడు ర్యాలీ సత్యనారాయణ, కొప్పినీటి నరేష్, పట్టపు నాగేంద్ర, పాశం నాగమల్లేశ్వరరావు, వాసుదేవ కృష్ణ, కొప్పినేటి వెంకన్న బాబు, నరసింహ స్వామి, మోకా లక్ష్మి, పులశెట్టి నాగబాబు, దాసరి నాని, పట్టపు పవన్, పట్టపు వెంకటేష్, పట్టపు సాయిబాబు మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.