భూమిక శివాంజలిని సత్కరించిన జనసేన శ్రేణులు

ఆచంట నియోజకవర్గం, వల్లూరు గ్రామం వల్లూరుతోటలో నీట్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో 575 మార్కులు సాధించిన చిరంజీవి నారిన భూమిక శివాంజలిని అభినందించిన జనసేనపార్టీ శ్రేణులు మరియు వల్లూరుతోట గ్రామ ప్రజలు. ఈ కార్యక్రమంలో మొదటగా జనసేనపార్టీ పిఏసి సభ్యులు మరియు ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ చేగొండి సూరప్రకాష్ భూమిక శివాంజలికి పుష్ప గుచ్చము ఇచ్చి కేక్ కటింగ్ చేయించి అభినందించడం జరిగింది. జనసేన సీనియర్ నాయుకులు తోట తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. గ్రామ ప్రజలు, పెద్దలు చిన్నారి శివాంజలిని దీవించి, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మరియు జనసేన నాయుకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, నారిన రాము, ఏడిద సూర్యనారాయణ, నారిన వెంకట రామారావు, కడిమి ఉమామహేశ్వరస్వామి, దివి శ్రీనివాస్, నంబూరి విజయ్, జడ్డు ఫణింద్ర, బండి శ్యాంప్రసాద్, గెద్దాడ ప్రసాద్, ఏడిద వెంకట్రాజు, ఏడిద శ్రీనివాస్, బెల్లంకొండ ప్రసాద్, కావలి శ్రీనివాస్, ఆకుల సుబ్బారావు, విజయ్, డేగల సత్తికొండ, పితాని లక్ష్మణ్, తోట సాయిబాబా, ఏడిద బాలు, ఏడిద తేజవిగ్నేష్, చేగొండి చిన్ని మొదలగువారు పాల్గొని చిరంజీవి భూమిక శివాంజలిని, తల్లిదండ్రులు శ్రీనివాసరావు దంపతులును అభినందించడం జరిగింది.