యజ్ఞంలా సాగుతున్న జనసేన శ్రమదానం..

  • అనంతపురం అర్బన్ ఇంచార్జ్ టీసీ వరుణ్ ఆధ్వర్యంలో జనసేన శ్రమదానం 7వ రోజు కార్యక్రమంలో భాగంగా ఒక్క ఫోన్ కాల్ తో ప్రధాన రోడ్ల మరమ్మత్తులు …
  • జనసేన శ్రమదానంలో భాగంగా నారాయణపురం పంచాయతీ, ఏ.ఎస్.ఆర్ నగర్ లో రోడ్ల మరమ్మతులు
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో…7వ రోజు నారాయణపురం పంచాయతీలోని పలు వార్డులలో గుంతల రోడ్లకు జనసేన శ్రమదానం
  • నారాయణపురం పంచాయతీ, ప్రాంతాల్లో డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి సమస్యలపై ప్రశ్నించిన నాయకులు
  • అంగన్వాడి భవనంలో చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టిక ఆహారం అందించాలి.. జనసేన డిమాండ్
  • ప్రజా సమస్యలు గాలికి వదిలేసేస్తారా… మీకు చేతకాకపోతే గద్దె దిగండి
  • అనంతపురం అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్

అనంతపురం, నారాయణపురం పంచాయతీలో గురువారం అర్బన్ ఇంచార్జ్ , జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆద్వర్యంలో జనసేన నాయకులు ఏ.ఎస్.ఆర్, గోపాల్ నగర్ పరిధిలోని గుంతల రహదారులకు మరమ్మత్తులు చేసి.. అనంతరం పలు సమస్యలైన విద్యుత్తు, మంచి నీరు, అంగడివాడి భవనంలో చిన్నారుల మరియు గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడుతూ.. పారిశుద్ధ సమస్యలతో, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని 2వ వార్డు ల్లోని అంగన్వాడి భవనంలో విద్యుత్తు సరిగా లేకపోవడంతో పాటుగా ప్రతి వీధిలోనూ, డ్రైనేజీలు, కుళ్ళునీరు, చెత్త చెదారాలతో పేరుకుపోయి దోమలు బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారని. ప్రజా సమస్యలు మీరు గాలికి వదిలేసినారని. ఏనాడైనా వార్డుల్లో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి తిరిగారా అని వైసిపి ప్రజా ప్రతినిధులను నిలదీశారు. కేవలం ఓట్లు కోసమే వస్తారని. ప్రజలకు సమస్య వస్తే, కంటికి కనిపించని నాయకులు మీరు.. పరిపాలన సాగించేదని ఇలాంటి దౌర్భాగ్యమైన పరిపాలన ఎన్నడూ చూడ లేదని, వార్డులోని స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అనంతరం ఏ.ఎస్.ఆర్ నగర్ ప్రాంతాలలో శిధిలమైన రహదారులకు అనంతపురం అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టీ.సీ.వరుణ్, నాయకులు, జనసైనికులు కలసి ఎర్రమట్టి వేసి గోతులను పూడ్చి చదును చేశారు. ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేశులు, దారాజ్ భాష, జిల్లా సంయుక్త కార్యదర్శులు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర కార్యదర్శిలు విశ్వనాథ్, రూప మారిశెట్టి, మురళి, లాల్ స్వామి, సంపత్, నగర కార్యదర్శులు వెంకటరమణ, ఆకుల అశోక్, పవన్, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ కుమార్ మరియు నాయకులు రామ్మోహన్, చిరు, పవనిజం రాజు, వడ్డే వెంకటేష్, మళ్లీ, నౌషాద్, మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.