రైతాంగానికి అండగా చంద్రగిరి జనసేన

  • జిల్లా కలెక్టర్ ని రైతులతో కలిసి వినతిపత్రం సమర్పించిన దేవర మనోహర

చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్.హెచ్ 140 వల్ల నష్టపోతున్న పనపాకం స్థానికులకు మరియు రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించి వారికి పునరావాసం కల్పించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కి రైతులతో కలిసి వెళ్ళి వారు పడుతున్న ఇబ్బందులను తెలిపి, వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో కలెక్టరుకి తెలుపుతూ, స్థానిక ఎన్.హెచ్ -140, నాయుడు పేట నుంచి చిత్తూర్ వైపు వెళ్తున్న ప్రధాన రహదారిలో పనపాకం పంచాయతీలోని ఇరివిశెట్టిపల్లె వాస్తవ్యులు దాదాపు 20 మందికి పైగా ఇండ్లు కట్టుకోవడానికి తీసుకున్న ప్లాట్స్ మరియు వివిధ రకాల అహరోర్త్పత్తులు పండించుకుంటున్న భూములు కోల్పోతున్నారని, వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే బలవంతగా అదికూడా నామమాత్ర మైన నష్ట పరిహారం చెల్లించారు మిగిలిన 17 మంది రైతులకి ఎటువంటి నష్ట పరిహారం చెల్లించలేదంటూ వాపోయారు. బుధవారం నాడు ఎన్.హెచ్.ఏ.ఐ దౌర్యజన్యంగా పనులు ప్రారంభించటంతో, ఇది ఎంతవరకు న్యాయం అని రైతులు ప్రశ్నించగా అధికారులు తిరగపడడంతో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా చర్యలు తీసుకోకపోవడంతో వారు జనసేనపార్టీ నియోజకవర్గ నాయకులు దేవర మనోహరని కలిసి వారి బాధలను, పడుతున్న ఇబ్బందులను తెలపగా. జనసేన ప్రజల పక్షాన నిలబడి బాధితులకి న్యాయం జరిగే విధంగా కింద కనపర్చిన డిమాండ్లు పరిశీలించి న్యాయం చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, సంజీవి హరి, వాకా మురళి తదితరులు పాల్గొని రైతులకు అండగా నిలవడం జరిగింది.

  1. ఎన్.హెచ్.ఏ.ఐ వారు కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం ది రైట్ టు ఫెయిర్ కాంపన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సి ఇన్ లాండ్ ఎక్విజిషన్, రిహబిలిటేషన్ అండ్ రెసెటిల్మెంట్ చట్టం 2003 ప్రకారం నష్ట
    పరిహారాన్ని లెక్కించి నష్ట పరిహారం చెల్లించాలి.
  2. ప్రభుత్వ అధికారులు నష్ట పోతున్న స్థానికుల ఇల్లు భూములను రీ-సర్వే చేసి ఎటువంటి పక్షపాతం
    లేకుండా ప్రస్తుత మార్కెట్ ఆధారంగా నష్ట పరిహారం చెల్లించాలి .
  3. ఇండ్లు కోల్పోతున్న బాధితులకు బిల్డింగ్ విలువ మరియు భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం అంచనా వేసి రీ-సర్వే చేసి న్యాయపరంగా చట్టం ప్రకారం నష్ట పరిహారం అందించాలి.
  4. వ్యవసాయ సాగు భూములకు ఆ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా రీ-సర్వే చేసి మరియు
    ఆ భూములలో ఉన్న చెట్లు, పంటలు మరియు ఏ ఇతర అన్నింటిని కలిపి నష్ట పరిహారం చెల్లించాలి.
  5. వీరందరికి తక్షణమే వాళ్ళు ఇంతకు మునుపులాగా జీవించే విధంగా రోడ్డుకి దగ్గర ఉన్న ప్రదేశాలలో
    అనువైన భూములలో వారికి పునరావాసం కల్పించాలి.
    అనే 5 ముఖ్య డిమాండ్లను నెరవేర్చాలని కోరడం జరిగింది.