అంగన్వాడీ ఉద్యోగుల నిరసనకు జనసేన మద్దతు

పూతలపట్టు: యాదమరి మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరసనకు జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియజేసి వారికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కుమార్ మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు నిరసన చేపట్టినప్పటికి ప్రభుత్వం తరఫున ఎటువంటి స్పందన లేకపోవడం ఈ ప్రభుత్వం యొక్క నియంత్రత్వ ధోరణికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు జనసేన పార్టీ తరఫున మద్దతును తెలియజేస్తూ వారి యొక్క న్యాయబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని రాబోయే ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేముల పవన్, కార్యదర్శులు నూరల్లా, భరణి, చిరంజీవి, కాపు సంక్షేమ సేన యువత నియోజకవర్గ ఇన్చార్జి ప్రభాకర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు యుగంధర్, నానబాల లోకేష్, జన సైనికులు నిఖిల్, తులసి చంద్రమోహన్, భరత్ తదితరులు పాల్గొనడం జరిగింది.