ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించిన జనసేన

పాడేరు డివిజన్, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్స్ కమిటీ సభ్యులు సి.హెచ్.కిరణ్ ప్రసాద్, ఎం.నాగలక్ష్మి, ఏ.శరని దేవి, ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించి రైతులు పండించే పంటలు, వాటి దిగుబడులు, ఉత్పత్తి సామర్ధ్యం, సాగువిదానం, మార్కెట్ సదుపాయం గిట్టుబాటు ధర ఇత్యాది విషయాలపై పరిశీలించి ఏ విధమైన పద్ధతులు అవలంబిస్తే రైతు కష్టానికి తగ్గట్టు గిట్టుబాటు ధర పడుతుందని,అలాగే ఈ విషయాలను రైతులతో అభిప్రాయ సేకరణ చేస్తూ ముందుగా ఇరడపల్లి, పంచాయితీ, నిరోదవలస గ్రామం, గొండేలి పంచాయితీ గొండేలి గ్రామం, బడిమేల పంచాయితీ ఇసకగరువు గ్రామ రైతులతో సర్చించి ఈ విషయాలను పార్టీ అధిష్టానానికి తీసుకెళ్తూ భవిష్యత్ లో మంచి ప్రాధాన్యతనిస్తు రైతులసంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అరకుపార్లమెంట్ ఇన్చార్జి డా. వంపూరు గంగులయ్య, పాడేరు మండల అధికార ప్రతినిధి దివ్యలత, దుర్గాలత పార్లమెంట్ ఎక్సిక్యూటివ్ మెంబర్ కొర్ర కమలహాసన్, చింతపల్లి నాయకులు వినయ్, పాడేరు మండల అధ్యక్షులు మురళి క్రిష్ణా, ఉపాధ్యక్షులు అశోక్, సత్యనారాయణ, సత్తిబాబు, పలువురు జనసైనికులు పెద్దఎత్తున వీరమహిళలు పాల్గొన్నారు.