దర్శిపర్రు గ్రామంలో జనసేన పల్లెపోరు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: పెంటపాడు మండలంలో బొలిశెట్టి శ్రీనివాస్ వారి తనయులు రాజేష్ ఇరువురితో శుక్రవారం ఘనంగా పల్లెపోరు కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో ముందుగా దర్శపర్రు గ్రామంలో పాడపైన మంచినీటి చెరువును జనసేన గ్రామ సర్పంచ్ కోల శేషవేణీ మార్కండేయుల దంపతులు మరియు పాలకమండలి దర్శిపర్రు గ్రామ ప్రజల సహకారంతో సుమారు 35 లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్ మరియు మంచినీటి చెరువును ఏర్పాటు చేసి బొలిశెట్టి శ్రీనివాస్ మరియు బొలిశెట్టి రాజేష్ గారితో రిబ్బన్ కటింగ్ చేసి మంచి నీటిని మరియు వాకింగ్ ట్రాకింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్ళు గడుస్తున్న కిలోమీటర్ దూరంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న దర్శిపర్రు గ్రామానికి డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టకపోవడం, వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన సర్పంచు ఎన్నిసార్లు డ్రైనేజీ వ్యవస్థపై అభ్యర్థన చేసిన తిరస్కరించడం వైసీపీ దృశ్య చర్య అని ఎలక్షన్ అనంతరం దర్శిపర్రు గ్రామంలో కోటిన్నర రూపాయలు గ్రాంట్ అని చెప్పి అభివృద్ధి పథకాలకు శిలాఫలకం వేసి నాలుగున్నర సంవత్సరాలు గడిచిందని ఆ శిలా పలకలు శిలాఫలకాలుగానే మిగిలిపోయాయని శ్రీనివాస్ ఎద్దోవ చేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం అధ్యక్షులు పుల్లా బాబి, పెంటపాడు మండలం మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ మరియు స్థానిక నాయకులు మద్దూరి సత్య నారాయణ, ఐటం వెంకన్న బాబు, ఏపూరి ప్రభాకర్, డంగేటి అన్నవరం, పాలూరి బూపాల్, వీరంశెట్టి పల్లపరాజు, పాలూరి శ్రీను, ఏపూరి వెంకటేశ్వరరావు, ఆల కరుణ, నల్ల మట్టి మోహన్ రావు, మాదిరెడ్డి రమేష్, గట్టి రాము, పంతం వంశీ, తదితరులు మరియు తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.