విద్యార్ధుల స్పెషల్ బస్ టైమింగ్ మార్చాలని కోరిన జనసేన

శ్రీకాకుళం జిల్లా, మంగళవారం ఉదయం కింతల్లిమిల్లి జంక్షన్ దగ్గర స్టూడెంట్స్ కాలేజ్ కి వెళ్ళడానికి ఆ జంక్షన్లో పలె వెలుగులు బస్సు గురించి కొంత మంది విద్యార్థులు ఉండటం జరిగింది. అయితే ఆ జంక్షన్ లో బస్సు అపకపోవడంతో విద్యార్థులు అందరూ కలిసి శ్రీకాకుళం ఏపిఎస్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ కాకర్ల బాబాజీ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఏపిఎస్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడటం జరిగింది…‌ అలాగే కాంప్లెక్స్ డిఎం తో మాట్లాడి స్టూడెంట్స్ స్పెషల్ బస్సు చిలకపాలేం నుంచి శ్రీకాకుళం కాంప్లెక్స్ వరకు ఒక బస్ ఉంది… అయితే బాబాజీ మాట్లాడుతూ ఆ బస్ టైమింగ్ మార్చాలని డిఎం కి చెప్పడం జరిగింది. అలాగే డిఎం మాట్లాడుతూ స్టూడెంట్స్ స్పెషల్ బస్ చిలకపాలేం నుంచి ఉదయం 8:30 కి పెడతామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విక్కీ, రామారాజు, ప్రకాష్, పవన్, సాయి, అలాగే ఎస్.ఎఫ్.ఐ విద్యార్థి విభాగ నాయకులు పాల్గొన్నారు.