ప్రజల దాహార్తిని తీర్చిన జనసేన వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం రెండు గ్రామాలలో త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది. గొంది గ్రామంలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి గొంది వెన్నెల స్టూడియో శేఖర్ ట్రాక్టర్ డిజల్ ఖర్చులకు ఆర్ధికసాయం మరియు మలికిపురం గ్రామంలో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి మలికిపురం ఎంపిటిసి జక్కంపూడి శ్రీదేవిశ్రీనివాస్ ట్రాక్టర్ డీజల్ ఖర్చులకు ఆర్ధికసాయం అందించగా మలికిపురం గొంది జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.