ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని ఒమిక్రాన్ అవగాహనా కార్యక్రమం నిర్వహించిన జనసేన

విశాఖపట్నం, కరోనా కొత్త రకం వేరియంట్ మన రాష్ట్రంలోకి ప్రవేశించిన నేపథ్యంలో ప్రజలు అందరం అప్రమత్తంగా ఉండాలని ఒమిక్రాన్ అవేర్నెస్ కార్యక్రమం విశాఖపట్నం 22వ వార్డ్ శ్రీ దేవర రఘు ఆధ్వర్యంలో 22వ వార్డ్ జనసైనికులు మద్దిలపాలెం తెలుగు తల్లి విగ్రహం సిగ్నల్స్ దగ్గర ప్రజలకు తెలియచేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి 22 వ వార్డ్ జనసేన కార్పొరేటర్ శ్రీ పీతల మూర్తి యాదవ్, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.