బుచ్చి ఎమ్మార్వోకి జనసేన ఫిర్యాదు

కోవూరు, మినగల్లు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టండి అంటూ జనసేన పార్టీ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు సుదీర్ బద్దిపూడి ఆధ్వర్యంలో బుచ్చి ఎమ్మార్వోకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ… ప్రసన్నా బాగున్నారా? బానే ఉంటావులే నీకేంలే గానే ఒకపక్క ఇసుక తవ్వకాలు, మరో పక్క గ్రావెల్ తవ్వకాలు, ఇంకో పక్క భూకబ్జాలు బానే ఉందిలే దోపిడీ అన్నారు. పేదల ఇల్లు తగలబడిపోయి ఏడుస్తుంటే నాలుగు రోజుల తర్వాత గుర్తొచ్చారా..? అగ్ని ప్రమాదం జరిగితే తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు ఎమ్మార్వో అందించాలని విషయం గుర్తుందా…? లేక ప్రభుత్వ ఖజానా మొత్తం మీరు ఖాలీ చేసేసారా..? ఒక్కో రీచ్ లో రోజుకి సమారు 10 లక్షలు రూపాయలు ఇసుక దోచి బందిపోట్లుగా మారిన మీరు పదివేల రూపాయలు ఇచ్చేది పది ప్రవచనాలు చెప్పేస్తే సరిపోతుందా? నెల్లూరు నుంచి ఎవరో వచ్చారని అన్నారు. అన్నట్టు మీ నాన్న ఏడనుంచి వచ్చాడో మరచిపోయావా… వెంకటగిరి మీది కోవూరు నియోజకవర్గం వచ్చి రాజకీయంగా స్థిరపడిపోయినావ్ అంతే. బానే చదువుకున్నావు కదా..? నువ్వు పేపర్ లో ఫోటో ఒక్కటే చూస్తే ఎలా..? దాని కింద మేటర్ చదవట్ల మేము ఫోటో వేసిన ప్రతిసారి నీ వైఫల్యాలు, దోపిడీ, దురాక్రమణలు, దౌర్జన్యాల గురించి మాట్లాడినా అబ్బా సూస్కోబల్లే. పేపర్ లో వేసిన దేనికి కూడా మన దగ్గర సమాధానం కూడా లేదు అది కూడా గుర్తుంచుకోండి. ఇంకా ఏదో అన్నావ్ అబ్బా మమ్మల్ని అడిగితే ఇల్లు, స్థలాలు ఇస్తారా..? మీ సొంత సంపాదన నుంచి మీ ఆస్తులు అమ్మి ఏమైనా ఇస్తున్నారా…? ప్రభుత్వ రాబడి నుంచి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన ఋణాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల నుంచి ఇచ్చి కదా మీరు ఇల్లు, సంక్షేమ పథకాలు ఇచ్చేది. దోపిడీ గురించి ప్రశ్నించినోలంతా పిచ్చోళ్ళు దోచేవాళ్ళు దొరలా…? ఇసుక అక్రమ రవాణా గురించి ప్రశ్నిస్తే జనసేన పార్టీ నాయకులు మీద కేసులు పెట్టడం అన్యాయం, దీన్ని ఖచ్చితంగా నిలదీస్తాం పై అధికారుల దృష్టికి తీసుకువచ్చి అధికారుల వారు బాధ్యతలు తెలుసుకునేంతవరకు కూడా పోరాడుదాం. కోవూరు ఎమ్మెల్యే అనుచరుడు మీడియా గ్రూపుల్ని వ్యక్తిగతంగా వాడుతున్నారని పవన్ కళ్యాణ్ మీద మా నాయకులపై కామెంట్ చేయడం వలన పెద్ద ప్రయోజనం ఉండదు. ప్రజా సమస్యల గురించి మీరు చేసిన వాటి గురించి, చేయాల్సిన వాటి గురించి ఆలోచిస్తే మంచిది. అతను మాట్లాడుతూ ఆయన ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు మేము చెడ్డీలు కూడా వేసుకోలేదు అన్నారు. నిజమే కానీ మేము రాజకీయాలు స్టార్ట్ చేసిన తర్వాత అక్రమార్జన నిలదీయటం వలన మీ మీ నాయకుల చేత డైపర్లు వేయించామని గుర్తు చేశారు.