రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలులో అక్రమాలపై జనసేన పోరాటం

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలంలో రైతాంగం నష్టపోతున్నారు. రైతులు తమ వరి పంట ప్రభుత్వానికి అమ్మడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 3 నెలల క్రితమే రైతు భరోసా కేంద్రాల్లో పూర్తి చేసినప్పటికీ నేడు దాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోంది.
రైతు భరోసా కేంద్రాల ద్వారా దాన్యం కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం, క్వింటాలుకి 105 కేజీలు అంటే 5 కేజీల అదనంగా సేకరిస్తున్నారు. ఈ అక్రమాలపై జనసేన పార్టీ గళం వినిపించి రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో జనసేన మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర(శివ) సహా జనసేన కార్యవర్గం అందరూ కలిసి మండల వ్యవసాయ అధికారికి తెలియజేస్తూ, విజ్ఞాపన పత్రం అందజేశారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ సమస్యలు పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని,రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోజనసేన మండల అధ్యక్షులు జలపారి అప్పడుదొర(శివ), రాష్ట్ర మత్సకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, మాదేటి ఈశ్వర్రావు, జానకీరామ్, దుక్క అప్పలరాజు, స్మార్ట్ రమేష్, ౠర సతీష్, పిన్నింటి అప్పలనాయుడు, ప్రమోద్, బోనెల నర్సింగరావు, జమరాజు, జగదీష్, వంశీ కృష్ణ,అడ్డగర్ల హరి, కె సిద్దు, మర్రి నూకరాజు, రౌతు దుర్గాప్రసాద్, వెంకటేష్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.