మున్సిపల్ కుళాయిలలో నీరు రావట్లేదని జనసేన వినతిపత్రం

విజయనగరం జిల్లా, విజయనగరం నియోజకవర్గం గత ప్రభుత్వం మంజూరు చేసిన 200 రూపాయల మున్సిపల్ కుళాయిలు ఇప్పటివరకు నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్యను జనసేన పార్టీ యువ నాయకులు కార్పొరేటర్ అభ్యర్థి హుసేన్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరియు స్థానిక సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు చక్రవర్తి, జనసైనికులు భవాని, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.