బత్తుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

  • రాజానగరం నియోజకవర్గంలో రోజు రోజుకీ పుంజుకుంటున్న జనసేన పార్టీ
  • రాజానగరం నియోజకవర్గంలో స్థానికుడు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు పాత తుంగపాడు ప్రజలు

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, పాత తుంగపాడు గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జి బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ నుండి జనసేన పార్టీలో చేరికలు. నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్న వైస్సార్సీపీ. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి, రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న విధానం నచ్చి 30 మంది వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు.. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదర ఆహ్వానం పలికిన బత్తుల.. పార్టీలోకి జాయిన్ అయిన వారిలో వల్లభశెట్టి అర్జున రావు, లంకలపల్లి సూర్యచంద్రరావు, కూసు రాంబాబు, బోయిడి బాబూజీ, పోటి సత్యనారాయణ, భవిరిశెట్టి సాయిబాబు, కూనపురెడ్డి చిన్నయ్య, నంద్యాల సాంబయ్య, నంద్యాల గోవింద్, నంద్యాల శ్రీను, నంద్యాల చిన్నయ్య, కమిడి శ్రీను, బోయిడి అన్నవరం, బిందానపు యేసయ్య, బోయిడి దుర్గాప్రసాద్, అల్లిమిల్లి సోమేశ్వరరావు, మరుకుర్తి వెంకన్న, మేడిది వెంకన్న, నాగులపల్లి అభిరామ, యాళ్ళ శివ రామకృష్ణ, వేల్పకొండ సాయి చరణ్, ఉంగరాల గంగాప్రసాద్, బచ్చు శ్రీను, లంక ప్రసాద్, బిందానపు నాగేశ్వరరావు, బోయిడి సుబ్రహ్మణ్యం, బచ్చు శ్రీను, బోయిడి బుజ్జియ్య తదితరులు పార్టీలోకి జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.