రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరికలు

రాజంపేట నియోజకవర్గం: ఉమ్మడి కడప జిల్లా నందలూరు మండలంలోని పాటూరు పంచాయతీలోని ఎస్టీ కాలనీ, ఎస్ సి కాలని, తురకపల్లె, గంగెద్దుల పల్లె, పెద్దూరులో రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు నేతృత్వంలో దాదాపు 300 మంది పైగా వైసీపీ, టిడిపి పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగినది. ఆదివారం పాటూరు పంచాయతిలో ఇంటి ఇంటికి జనసేన పార్టీ ప్రచారంలో యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ మండలం పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదని మీ అందరి చల్లని దీవెనలు జనసేన పార్టీకి ఉండాలని ప్రజా సేవ చేయడం కోసం నేను ఉన్నతమైన ఉద్యోగాన్ని సైతం వదులుకొని జనసేన పార్టీలో చేరడం జరిగినది. ఇన్ని సంవత్సరాలు వివిధ పార్టీలను చూసిన మీరు ఒకసారి జనసేన పార్టీని కూడా నమ్మి ప్రజలు బాగుండాలని కోరుకొనే పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాముఖ్యత కల్పిస్తామని జనసేన టిడిపి కూటమితో వచ్చే ప్రభుత్వం ప్రజా సమస్యలను తీరుస్తుందని, మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని తెలియజేశారు. నందలూరు మండల జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, ఆకుల చలపతి, గురివిగారి వాసు, మణి, లక్ష్మీకర్ సాయి, పాటూరు జనసైనికులు ఎల్.శివ శంకర్ రాజు, వెలుగు వెంకటసుబ్బయ్య, మేకల అమర్,నిమ్మల మధు, జలకం ప్రసాద్, చలం, రామయ్య, లక్ష్మయ్య, జలకం శివాజీ, జలకం పెంచలయ్య, శ్రీనివాసులు, ముమ్మిడి చెట్టు మణి, ఆవులు ఈశ్వర్, నర్రా రమేష్ శెట్టి, హరి, యెద్దుల ధనుష్, నరుకూరి హరి, యెద్దుల మహేష్, ఆవుల నరసింహులు, యెద్దుల రామ్మూర్తి, నాగ శేషు సాయి, పసుపులేటి సురేష్, శివరామరాజు, చంద్రమౌళి, బాలరాజు, నరసింహరాజు, పసుపులేటి శ్రీనివాసులు, చవాకుల వెంకటరమణ, నర్రా చిరంజీవి, కోనేరు శివసాయి, కోనేరు సుబ్బరాయుడు, కోనేరు పెంచలయ్య సునీల్ కుమార్, సీతా రామయ్య, శరత్, భరత్,ఖాదర్ బాష, వీరమహిళలు వెంకట సుబ్బమ్మ, ఎల్లమ్మ, నిమ్మల అక్కమ్మ, పార్వతి, సుజాత, రమణమ్మ, కావ్య, రాజంపేట జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, కోలాటంహరి, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.