డీకే పట్నం, బొడ్డవలస, టోంకి, గ్రామాల నుంచి జనసేన పార్టీలోకి చేరికలు

పార్వతీపురం: డీకే పట్నం గ్రామ పంచాయతీ పరిధిలో బొడ్డవలస, టోంకి గ్రామాలలో నిర్వహించిన జనసేన గ్రామ బాట కార్యక్రమంలో భాగంగా.. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి రాజకీయాలలో మార్పు కోరుకుంటూ అ గ్రామంలో వున్న టిడిపి, వైయస్సార్సీపి నాయుకులు, యువత, పార్వతీపురం నియోజకవర్గ నాయుకులు, పార్వతిపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మని, అక్కివరపు మోహన్ రావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు సమక్షంలో జనసేన పార్టీలో బారీగా చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లి గణేశ్వరరావు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, కర్రీ మణికంఠ, అల్లు రమేష్, సతీష్, పైల రాజు, పాత్ర పవన్, అక్కేన భాస్కరరావు, అంబటి బలరాం, అన్నా బత్తుల దుర్గాప్రసాద్, సింగిడి సంతోష్, దుర్గా, కనకరాజు, పాత్ర ప్రదీప్, కృప రావు, కేశవరావు, మహేష్, శివ, సాయి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు, ఇలాగే రానున్న రోజుల్లో మన పార్టీ బలోపేతం కోసం అందరం కలిసి పని చేయాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గం జనసైనికులకి, బొబ్బిలి నియోజకవర్గం జనసైనికులకి, మరియు బలిజిపేట, సీతానగరం మండల జనసైనికులకి పేరు పేరునా పార్వతీపురం మండల జనసేన తరుపున ముఖ్యంగా గోచక్క పంచాయతీ జనసైనికులు అందరికీ, డోకిశీల పంచాయతీ జనసైనికులు అందరికీ ధన్యవాదములు తెలిపారు.