రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తనతో జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం

జె.ఎస్.పి గ్లోబల్ టీం-ప్రపంచ ఎన్నారై కలయిక ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తనతో ఆదివారం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. జె.ఎస్.పి గ్లోబల్ టీం-ప్రపంచ ఎన్నారై కలయిక వ్యవస్థాపకులు సురేష్ వరికూటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుండి ఎన్నారై జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మే నెలలో జరగనున్న ఎన్నికల కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది. న్యూట్రల్ ఓటర్లను ఏ విధంగా జనసేన-టిడిపి-బిజేపి కూటమికి ఓటు వేసే విధంగా ఎలా ప్రభావితం చేయాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది. ఎన్నారైలు ఈ ఎన్నికలలో ఏవిధమైన సహకారమందించాలి, ఎలా పనిచేయాలి అనే విషయాలపై శ్రీమతి కీర్తన తమ అమూల్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది. పార్టీని ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు నా సేన కోసం నా వంతుకు పార్టీ అకౌంటుకి డైరెక్టుగా పంపించాలని శ్రీమతి కీర్తన తెలిపారు. పార్టీ గుర్తు గాజు గ్లాసును మరియు పార్టీ అభ్యర్ధులను ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళే విధంగా డిజిటల్ క్యాంపెయినింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపి జె.ఎస్.పి గ్లోబల్ టీం నుండి మరింత మంది అధికార ప్రతినిధులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇదేసమయంలో జనముద్ర మరియు జనసహస్ర టీం లు జనసేన్ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళేవిధంగా చేస్తున్న కార్యాచరణ గురించి తెలిపారు. అనంతరం లీగల్ టీం నుండి ఎన్నారై జనసెన నాయకులకు మరియు జనసైనికులకు సహకారమందించాలని కోరడం జరిగింది. జనసెన మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత వాటిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళేవిధంగా పాంప్లెట్ల రూపంలో తీసుకెళ్ళాలని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత గురించి తెలిపి ఈసారి జనసేన-టిడిపి-బిజెపి కూటమి గెలుస్తుందని తెలిపారు.