జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించి సహాయం అందించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన జనసైనికుడు కాకరపర్తి దుర్గ తండ్రి కాకరపర్తి నాగరాజు అకాలంగా మరణించారు. విషయం తెలుసుకున్న పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు గురువారం చేబ్రోలు గ్రామంలో గల స్వర్గీయ కాకరపర్తి నాగరాజు ఇంటికెళ్లి పరామర్శ చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ.. మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాకరపర్తి నాగరాజు. ఆయన మరణం కాకరపర్తి దుర్గకు తీరనిలోటు అని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా జనసైనికుడు కాకరపర్తి దుర్గ కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని సహాయంగా అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ భవిష్యత్తులో ఏ అవసరమైన నన్ను సంప్రదించాలని జనసైనికుడైన కాకరపర్తి దుర్గకు తగు భరోసా ఇచ్చారు. జ్యోతుల శ్రీనివాసు వెంట చేదులూరు త్రిమూర్తులు, గంటా గోపి, యలిబండి దొరబాబు, వులిశెట్టి సుబ్బారావు, సఖినాల వీరన్న, ఇంటి అప్పారావు, కాకరపర్తి చక్రం, చల్లా వెంకన్న, సఖినాల శంకర్రావు, సారంపాట్టి కిరణ్, కొప్పిశెట్టి విజయ, మేడిపోయిన హరికృష్ణ, వెదురుపాక దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.