జనసేనలో చేరిన కలాల హరి ప్రసాద్

మంగళగిరి: తిరుమల ముఖ్య నేత కలాల హరిప్రసాద్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆపార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ సమక్షంలో మంగళవారం ఆయన జనసేన పార్టీలో చేరారు. హరి ప్రసాద్ గతంలో ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలలో క్రియాశీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా జనసేన గెలుపుకు కృషి చేస్తానని, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తికి అండగా నిలవాలనే జనసేనలో చేరానన్నారు.