నాదెండ్లను కలిసిన కామిశెట్టి రమేష్

  • పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని కలిసిన గురజాల నియోజవర్గం, పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్

గురజాల: జనసేనలో ఐదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నాదెండ్ల మనోహర్ ను గురజాల నియోజవర్గం, పిడుగురాళ్ల మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. గురజాల నియోజకవర్గంలో జనసేన చేబడుతున్న కార్యక్రమాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా నియోజవర్గ పటిష్టతకు చేబట్టాల్సిన చర్యలపై మనోహర్ తగు సూచనలు చేశారు. జనసేన-టిడిపి పొత్తు నేపధ్యంలో ఇరు పార్టీ నేతలతో సమన్యయం చేసుకునే విధంగా, ఉమ్మడి కార్యాచరణ కోసం నియోజవర్గంలో త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని, తద్వారా నియోజవర్గంలో పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు నడిపించాలని రమేష్ కు సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సమస్యలపై వివరణ అడిగి, త్వరలో పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల లలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని.. రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారని, త్వరలో నియమించబోయే నియోజకవర్గ సమన్వయ కమిటీకి ప్రతి ఒక్కరు సహకరించి, ఈ వైసీపీ రాక్షస పాలను అంతమొందించాలని తెలియజేశారు.