రానా తో కంచెరపాలెం డైరక్టర్ వెంకటేష్ మహా

టాలీ వుడ్  హల్క్,  దగ్గుబాటి వారసుడు రానా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ప్రయోగాలు చేయాలని చూస్తుంటాడు. అందుకే విలన్ హీరో ఇలాంటి తేడాలు లేకుండా సినిమాలు ఒప్పుకుంటాడు. కథ నచ్చితే చాలు దర్శకుడు కొత్త వాడైనా సరే ఛాన్స్ ఇచ్చే రానా టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. రానా ఎంకరేజ్ చేసిన వారు సూపర్ సక్సెస్ లో ఉన్నారు.

ఇక కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో ప్రతిభ చాటిన వెంకటేష్ మహా కు ఆ సినిమా టైం లో రిలీజ్ కు సహకరించారు రానా. సినిమా చూసిన రానా వెంకటేష్ టాలెంట్ గుర్తించి రిలీజ్ విషయంలో సాయం చేశాడు. అనుకున్నట్టుగానే కేరాఫ్ కంచెరపాలెం హిట్టైంది. వెంకటేష్ మహా సెకండ్ ప్రాజెక్ట్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది. ఇక డైరక్టర్ తన థర్డ్ ప్రాజెక్ట్ గా సుమతి చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రానాతో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట వెంకటేష్ మహా.

ఆల్రెడీ రానాకి లైన్ చెప్పడం ఓకే చేయడం జరిగిందట. రానా, వెంకటేష్ మహా తప్పకుండా ఈ కాంబినేషన్ కొత్తగా ఉండబోతుందని మాత్రం చెప్పొచ్చు. ప్రయోగాల హీరో.. ప్రయోగాత్మక దర్శకుడు చేసే ఈ సినిమా అదరగొట్టడం ఖాయమని ఫిక్స్ అవ్వొచ్చు.