వారసుడి రాకతో ఆనందంలో కార్తి ట్వీట్

తమిళ నటుడు కార్తి అభిమానులకు తీపికబురు చెప్పారు. ఏడేళ్ళ తర్వాత కార్తి మరోసారి తండ్రి అయ్యారు. కార్తి భార్య రంజనీ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. ఈ విషయాన్ని కార్తి తన సోషల్ మీడియాలో వెల్లడించారు. మాకు మగబిడ్డ పుట్టాడు. మా ఈ ప్రయాణంలో అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు థ్యాంక్స్ చెప్పడం ఎంత మాత్రం సరిపోదు. మా బాబుకి మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్యు గాడ్ అని కామెంట్ పెట్టారు. ఇక కార్తి ట్వీట్‌కి సూర్య కూడా స్పందించారు. డాక్టర్ నిర్మలా శంకర్, ఆమె టీమ్‌కి మరోసారి థ్యాంక్స్ అంటూ కామెంట్ పెట్టారు.

కాగా 2011లో కార్తి, రంజనీ వివాహం చేసుకున్నారు. 2013లో వీరికి ఓ ఆడపిల్ల జన్మించింది. ఆమెకు ఉమయాళ్ అని పేరు పెట్టారు. ఇక కార్తి చెప్పిన గుడ్‌న్యూస్‌పై అభిమానులు స్పందిస్తున్నారు. అందరూ కార్తికి తమ అభినందనలు చెబుతున్నారు.