జనసేనలో చేరిన కౌముది కళాశాల అధినేత పాత్రుని పాపారావు

ఆమదాలవలస, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ మరియు జనసేన పార్టీ పర్యావరణ పరిరక్షణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన ఆమదాలవలస కౌముది కళాశాల అధినేత మరియు ప్రముఖ విద్యావేత్త పాత్రుని పాపారావు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పేడాడ రామ్మోహన్, పేడాడ నరసింహరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వడ్డెపల్లి శ్రీనువాసరావు, లావేరు మండల జనసేన పార్టీ నాయకులు, గోవిందపురం పంచాయతీ ఎంపిటిసి ఆభ్యర్ధి అదపాక అప్పలరాజు పాల్గొన్నారు.