నోటిని అదుపులో పెట్టుకో మంత్రి జోగి రమేష్: చిర్రి బాలరాజు

పోలవరం నియోజకవర్గం: వెంకటాపాలం బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే మరియు హౌసింగ్ మినిస్టర్ జోగి రమేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు పోలవరం నియోజకవర్గం ఇన్చార్జి చిర్రి బాలరాజు స్పందించారు. గురువారం ఆయన జీలుగుమిల్లి జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారిని అసభ్యపదజాలంతో దూషించడం, వ్యక్తిగత విషయాలను వ్యంగ్యంగా వక్రీకరించడం ఏంటి అని, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత జోగి రమేష్ కు లేదని, ఆయన నీ క్యాడర్ లో మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు, ఆయన పార్టీకి అధినేత అని గుర్తించుకోవాలని, నువ్వు మంత్రి అయితే ఎవరికి గొప్ప, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎవరికీ గొప్ప అని, ఒక పార్టీ అధినేత గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, జోగి రమేష్ అసభ్య పదజాలాలతో దూషిస్తుంటే పక్కన కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం కూడా చేయకుండా చూస్తున్నారని, జోగి రమేష్ భవిష్యత్తులో కూడా మంత్రి పదవి కోసం జగన్ మెప్పుకోసం అడ్డు అదుపు లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. మీరు ఈ భాషలో మాట్లాడితే మేము కూడా అదే భాషలో మాట్లాడగలమని, తరువాత పోయేది మీ పరువే అని తెలిపారు. తక్షణమే జోగి రమేష్ మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే అంతకుమించిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మీరు ఎలా రోడ్లమీద తిరుగుతారో చూస్తామని హెచ్చరించారు. ఎందుకని పదేపదే బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లు గురించి చర్చి తీసుకొస్తున్నారని వాటి వల్ల రాష్ట్రానికి ప్రయోజనాలు ఏంటి అని ప్రశ్నించారు. మీరు మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సరే మా అధినేత గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఇప్పటికైనా మీ మంత్రి స్థాయిని గుర్తుపెట్టుకొని మిగిలి ఉన్న కొద్ది సమయంలోనైనా కనీసం రాష్ట్రానికి మేలు చేకూరే పనులు చేయాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడాలని బాలరాజు సూచించారు.