అగ్ని ప్రమాదం బాదితులను ఆదుకున్న కొత్తపేట జనసేన

మందపల్లి గ్రామం, ఏనుగుమహాల్ లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల చల్లాబత్తుల రాధాకృష్ణ, గోసంగి మోసే.. వారి ఇల్లు కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకొన్న కొత్తపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్.. బాధితుల కుటుంబాలను పరామర్శించి.. కొత్తపేట జనసేన నాయకులు బొక్క ఆదినారాయణ, ఎంపిటిసి పల్లి శాంతి, మాచర దుర్గా ప్రసాద్రు, సాదే గణేష్, కంఠంశెట్టి చంటి, తులా రాజు, మహా దశ బాబులు, చోడపనేడి ఉమా, గవర బాబి, సలాది రమేష్, సలాది సాయి మరియు గ్రామ జనసేన కార్యకర్తలు జనసైనికులతో కలిసి బాధిత కుటుంబాలకు 7000 ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందజేశారు.