‘ప్రతి గుమ్మం వద్దకు జనసేన’కు శ్రీకారం చుట్టిన కొట్టి కుమార్

కదిరి నియోజకవర్గం: కదిరిలో కొట్టి కుమార్ ఆధ్వర్యంలో ప్రతి గుమ్మం వద్ద జనసేన కార్యక్రమాన్ని సోమవారం కొక్కంటి క్రాస్ శ్రీ జమ్ములింగేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకురావడం. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం బాలసముద్రం గ్రామం ఎస్సీ కాలనీ కొక్కంటీ క్రాస్ తో మొదలుపెట్టి భవిష్యత్తులో కదిరి నియోజకవర్గం మొత్తం ప్రతి గుమ్మం వద్దకు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను తీసుకుపోతాం అని కొట్టి కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా డైరెక్టర్ సాయి సురేషు, పారిశ్రామికవేత డేగల మహేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి జిల్లా కార్యనిర్వాహకాలు కమిటీ సభ్యుడు ఫయాజ్, అనురాధ, తనకల్లు మండల కన్వీనర్ కె.వి రమణ, కదిరి మండల కన్వీనర్ మహేష్ బాబు, ఎన్ పి కుంట మండలం మేకలచెరువు చౌదరి, గాండ్లపెంట రవి నాయక్, నల్లచెరువు సాకే రవికుమార్ సాకే రవికుమార్ జనసేన సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, వీరమహిళలు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.