ప్రిస్క్రిప్షన్ లేకుండానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు

కరోనా నిర్ధారణ పరీక్షలకు ఢిల్లీ లో మరిన్నికొత్త వెసులుబాట్లు కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల కోసం ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలనుకుంటే ఇకపై మీకు ఏ విధమైన డాక్టర్ ప్రిస్క్రిఫ్షన్  అవసరం లేకుండా ఢిల్లీలో ఈ మేరకు వెసులుబాట్లు కల్పించారు. స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అటు ఢిల్లీ హైకోర్టు మాత్రం కరోనా పరీక్ష చేయించుకునేవారు ఆధార్ కార్డును తీసుకెళ్లాలని..ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అందించే ఫామ్స్ పూరించాలని తెలిపింది.