కృష్ణాష్టమి: అన్నసంతర్పణలో పాలుపంచుకున్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: విరవాడ గ్రామం నందు కృష్ణాష్టమి సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన అన్నసంతర్పణ కార్యక్రమంలో భాగంగా గుడి కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నసంతర్పణ నిమిత్తం 5116/- రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దిబ్బిడి కృష్ణ, పల్నాటి మధుబాబు, కందా అప్పారావు, కొమ్మినీడి రమణ, బారెడ్డి స్వామి, కొండేపూడి దొర, పోప్పున రాజా, నాము చిట్టిబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.