‘కృష్ణవేణి’ వీడియో సాంగ్
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. యూత్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా, అక్టోబరు 2న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రచారంలో భాగంగా మంగళవారం ఈ చిత్రంలోని ‘కృష్ణవేణి’ వీడియో సాంగ్‌ను యువ కథానాయకుడు నాగశౌర్య విడుదల చేస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనూప్‌రూబెన్స్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ కుమార్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.