గాజువాక జనసేన అధ్వర్యంలో కార్మికుల దినోత్సవం వేడుకలు

గాజువాక, జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గంలో కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు కొత్త గాజువాక బి. సి రోడ్ జంక్షన్, మార్కెట్ వద్ద గాజువాక జనసేన పార్టీ నాయుకులు తిప్పల రమణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడే (కార్మికులు దినోత్సవం) సందర్భంగా కార్మికులకు అల్పాహారం అందించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ గాజువాక ఇంచార్జ్ కోన తాతరావు, గౌరవ అతిధులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, 64వార్డ్ కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి విచ్చేసారు. ఈ కార్యక్రమంలో సోమన్న అల్లు రామారావు, కాద శ్రీను, ముమ్మన మురళీ, గుంటూరు మూర్తి, కళావతి, శాలిని, రామలక్ష్మి, విజయ్, విందుల చిరురాజు, ములకలపల్లి వంశీ, వీరబాబు, రవీంద్రబాబు, భాస్కర్ రాజు తదితర జనసేన నాయకులు, వీరమహిళలు మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.