నాయకులతో పాటు ప్రజలకి కూడా బాధ్యత ఉండాలి

మన్యం పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామంలో ఉన్నటువంటి వీధి కాలువలను స్వచ్చంధంగా గ్రామ పెద్దలు, యువత, మహిళలు కలిసి పరిశుభ్రం చేసుకోవడం జరుగింది. గ్రామ అభివృద్ధి జరగాలి అన్నా, గ్రామం బాగుండాలి అన్నా, గ్రామం పరిశుభ్రంగా ఉండాలి అన్నా నాయకులతో పాటు ప్రజలకి కూడా బాధ్యత ఉండాలి అనేదే బొడ్లపాడు ప్రజలు ఆలోచన విధానం.