గాఢ నిద్రలో ఉన్న సీఎం ను మేలుకొల్పుదాం!: పామూరు జనసేన

కనిగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ కాంపెయిన్ లో భాగంగా కనిగిరి నియోజకవర్గం లోని పామూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కి వెళ్ళే ప్రధాన రహదారి గోతులమయమై, వర్షం వస్తే ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉన్న కూడా ప్రభుత్వం పట్టుంచుకోలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రోడ్లని బాగుచేసి ప్రమాదాలు అరికట్టాలి అని జనసైనికులు ఏద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుత్తి మహిత్, గుత్తి అఖిల్, వాసు, మహిళలు పాల్గొన్నారు.