రౌడీ బోయ్ విజయ్‌ తో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ టీం

‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ నటులందరూ తాజాగా రౌడీ బోయ్ విజయ్‌ దేవరకొండ ఇంట్లో కలిశారు. సుధాకర్‌, అభిజిత్‌తోపాటు ఆ సినిమాలో నటించిన పలువురు విజయ్‌ ఇంటికి వచ్చి సరదాగా గడిపారు. అయితే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తర్వాత అభిజీత్ ఇంకా ఏ సినిమాల్లో కనిపించలేదు. కాగా బిగ్ బాస్ సీజన్ 4 లో కనిపించాడు. అప్పటి నుంచే అభి గురించి మాటలు మొదలయ్యాయనే చెప్పుకోవచ్చు. హౌస్ లో అభి ఉండే తీరుకు హౌస్ మేట్స్ తో పాటుగా నెటిజన్లు కూడా అతని ప్రవర్తనకు ఫిదా అయ్యారు. మిస్టర్ కూల్ అంటూ నిక్ నేమ్ ను కూడా సంపాదించాడు. ఈ మిస్టర్ కూల్ బాయ్ ని బిగ్ బాస్ విజేతగా ఖరారు చేశారు నెటిజన్లు. టైటిల్ అందుకున్న అభికి బయటికి వచ్చిన తర్వాత తన విజయానికి కారకులైన వారిని కలుసుకుంటూ అభి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అభి నాగబాబును, విజయ్ దేవరకొండను కలిసి వారికి కృతజ్ఞతలు తెలిపి వారితో కొద్ది సేపు చిల్ అయ్యాడు అభిజీత్. ఆదివారం అభిజీత్ రౌడీ హీరోను కలిసాడు. అయితే అభితో పాటుగా రౌడీ దగ్గరికి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాకు చెందిన కొందరు నటులు కూడా అక్కడకొచ్చి సందడి చేశారు. అందరూ కలిసి ఫోటోలు దిగిన వాటిని సుధాకర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి.. లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ రీయూనియన్ అనే కామెంట్ ను కూడా జతచేశాడు. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.