మహారాష్ట్రలో ఆంక్షలు కఠినతరం.. 1నుండి 15 వరకు లాక్‌డౌన్‌!

ముంబై: మహారాష్ట్రలో రెండురోజులుగా 8వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో అక్కడ ఆంక్షలు కఠినతరమువుతున్నాయి. ఇలాగే కేసులు పెరుగుతూ పోతుంటే లాక్‌డౌన్‌ విధించినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆంక్షలను కఠినం చేస్తున్నట్లు మంత్రి విజరు వడ్డే తివార్‌ శుక్రవారం నాగ్‌పూర్‌లో వెల్లడించారు. కేసుల పెరుగుదలకు లోకల్‌ ట్రైన్లు కారణంగా ఉండడంతో వాటి సంఖ్యను తగ్గిస్తున్నామని తెలిపారు. అలాగే బస్సుల్లోనూ ఎక్కువమంది ప్రయాణించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. షాపింగ్‌ మాల్స్‌ను కూడా మూయనున్నామని, ఫంక్షన్‌ హాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు మంత్రి ప్రకటించారు. మరోవైపు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిద్దామా? లేక తమిళనాడులా విద్యార్థులను తర్వాతి తరగతులకు ప్రమోట్‌ చేయడమా అనే విషయాలపై పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకూ మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 21,29,821కు చేరాయి. ఇంకా పెరుగుతున్న కేసులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.మరోవైపు మార్చి 1 నుండి 15 వరకు లాక్‌డౌన్ విధించనున్నట్లు ఇతర పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.