పశ్చిమబెంగాల్ లో జూన్ 15 వరకు లాక్‌డౌన్ ఆంక్షలు

పశ్చిమబెంగాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను మరో 15 రోజుల వరకు పొడిగించారు. అక్కడ ఇప్పటికే ఆమల్లో ఉన్న లాక్‌డౌన్ మే 31తో ముగియనుంది. అయితే, కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో ఆంక్షలను జూన్ 15 వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్వయంగా వెల్లడించారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అమల్లో ఉన్న కఠిన ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగించాలని నిర్ణయించామని ఆమె తెలిపారు.