డెల్టా వేరియంట్ పై పోరు దిశగా ఆస్ట్రేలియాలో మళ్లీ మొదలైన లాక్ డౌన్!

ఆస్ట్రేలియా మరోమారు లాక్ డౌన్ దిశగా అడుగులు వేసింది. అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రమైన న్యూ సౌత్ వేల్స్ లో నేడు కరోనా కేసులు పెరగడం, వాటిల్లో డెల్టా వేరియంట్ కేసులు అధికంగా ఉండటంతో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశ జనాబాలో దాదాపు 25 శాతం మంది నివాసం ఉంటున్న సిడ్నీలో తాజాగా 150 డెల్టా వేరియంట్ కేసులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

పశ్చిమ ఆస్ట్రేలియా రాజధాని పెర్త్ తో పాటు డార్విన్, క్వీన్స్ లాండ్ లో సైతం నాలుగు రోజుల పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకముందే త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, మరింతగా శ్రమిస్తేనే కేసుల సంఖ్య పెరగకుండా చూడవచ్చని క్వీన్స్ లాండ్ ప్రీమియర్ అనాస్టాసియా తెలియజేశారు.