గణేష్ చతుర్థి సందర్భముగా లోకం మాధవి అన్నదానం కార్యక్రమం

నెల్లిమర్ల: భోగాపురం మండలం, అప్పన్నపేట గ్రామములో శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి సంధర్భంగా శనివారం నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆర్ధిక సహాయంతో సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల స్థాయి సీనియర్ నాయకులు పల్లంట్ల జగదీష్, అప్పన్నపేట గ్రామ జనసేన నాయకుడు గురుమూర్తి మరియు జనసైనికులు పాల్గొన్నారు.