శివుడు మీ సొంతింటి కలను నెరవేర్చాలి అంటే… ఇంటి ఇల్లాలు ఈ ఒక్క పని చేస్తే చాలు…!

సామాన్యుల నుండి కోటీశ్వరుల వరకు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ.. ఆ కల నెరవేరడానికి చాలా మందికి జీవిత కాలం పడుతుంది. ఇక మరికొంత మంది అయితే.. సొంత ఇంటిని కట్టుకోలేక జీవితంలో ఆ కోరిక కల గానే మిగిలిపోతుంది. కానీ సొంత ఇంటి కల నెరవేరడానికి డబ్బు ఒక్కటే ప్రధాన సమస్య కాదు.

చేతి నిండా లక్షలు పెట్టుకుని, చాలా కాలం నచ్చిన ఇల్లు దొరక్క.. కొంత మంది తిరుగుతూ ఉంటారు. మరి కొంత మంది దగ్గర కోట్ల రూపాయల ఆస్థి ఉంటుంది. కానీ.., వారికి మాత్రం సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన రాదు. వేలకి వేలు అద్దె ఇంటికి చెల్లిస్తుంటారు. ఇక్కడ వీరందరి సమస్య కేవలం డబ్బు మాత్రమే కాదు. ఆ సమయంలో వారికి గృహ సిద్ది కలగడం లేదు అంతే. ఇలాంటి చెడు సమయాన్ని పోగొట్టే ఒక ఒక శక్తి పరమ శివుడుకి మాత్రమే ఉంది. కేవలం ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే గృహం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ కార్య సిద్ధికి మనం ఏమి చేయాలో తెలుసుకుందామా.

శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. జాతకరీత్యా గృహ యోగం ఉన్నా, లేకపోయినా.. ఇంటి ఇల్లాలు 12 సోమవారాలు శివుడికి జాజిపువ్వులతో పూజ చేస్తే.. గృహ సిద్ది లభిస్తుందని పండితులు తెలియచేస్తున్నారు. ఇక్కడ ఒక్క విషయమేమిటంటే. మీరు ఎలాంటి కష్టం పడకుండా కేవలం శివుడికి పూజ చేసేయండి కార్య సిద్ది కలుగుతుందని మాత్రం కాదు. శివుని అనుగ్రహం లభిస్తే సొంత ఇంటి కల నెరవేరడానికి ఎలాంటి ఆటంకాలు రావని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని వదిలేయకుండా.. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ.., ఈ శివ పూజని కొనసాగిస్తూ.. భారమంతా శివయ్య పై  వేయండి.. మిగిలిన కార్యం ఆ ఈశ్వరుడే నెరవేరుస్తాడు.