‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారిక ప్రకటన!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ రూపొందింది. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో, నాగచైతన్య –  సాయిపల్లవి నాయకా నాయికలుగా నటించారు. ఈ పాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండవలసింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడం .. చిన్న సినిమాలు ధైర్యంగా ముందుకు వస్తుండటం మొదలైపోయింది.  దాంతో ‘లవ్ స్టోరీ’ ఎప్పుడు విడుదల కానుందనే ఆసక్తి అందరిలో పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాను ‘వినాయక చవితి’కి విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒక వార్త షికారు చేసింది.

తాజాగా ఈ సినిమా మేకర్స్ ‘వినాయకచవితి’ పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సీనియర్ హీరోయిన్ దేవయాని ఒక కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, ఇతర ముఖ్యమైన పాత్రల్లో పోసాని .. రావు రమేశ్ .. ఈశ్వరీరావు కనిపించనున్నారు.