మా తుజే సలాం..

ప్రముఖ బాలీవుడ్ నటి షబానాఅజ్మీ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన చిత్రం వైరల్‌గా మారింది. తన పసిబిడ్డను ఎత్తుకొని తలపై ఇటుకలు మోస్తున్న మహిళ చిత్రాన్ని షబానాఅజ్మీ పోస్టు చేసి, దానికి ఎఆర్ రెహమాన్ పాటలోని ”మా తుజే సలాం”అని క్యాప్షన్ పెట్టారు. భవననిర్మాణ కార్మికురాలు అయిన ఓ మహిళ తన భుజాలకు కట్టిన చీరలో తన బిడ్డను మోస్తూ ఇటుకలు ఎత్తిన చిత్రాన్ని షబానా అజ్మీ పోస్టు చేశారు. ఒకవైపు మహిళా కార్మికురాలు తన బిడ్డను మోస్తూ తలపై ఆరు ఇటుకలు ఎత్తుకున్న చిత్రం నెటిజన్లను కదిలించింది. శ్రమతో కూడిన కూలీ పనితో పిల్లల సంరక్షణ విధులను సమతుల్యం చేసిన మహిళను చాలామంది ప్రశంసించారు. మా తుజే సలాం శీర్షికతో షబానా పోస్టు చేసిన చిత్రానికి 5వేల లైక్ లు వందలాది రీట్వీట్లు వెల్లువెత్తాయి.