అగ్ని ప్రమాద బాధితులకు అండగా మాడుగుల నియోజకవర్గ జనసేన

మాడుగుల నియోజకవర్గంలో గల చీడికాడ మండలంలో అడవి ఆగ్రహారం గ్రామంలో కోన సింహాచలం, నమ్మి రాములుల ఇళ్ళకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది, ఆ సంఘటన తెలిసిన వెంటనే హుటహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్న మాడుగుల నియోజకవర్గ జనసైనికులు వెనువెంటనే ఆ అగ్నిప్రమాదబాధితుల కుటుంబాలకు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున 25క్గ్ బియ్యం, 5000ర్స్ డబ్బులు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ గుమ్మడి శ్రీరామ్ సాయం చేశారు. ఎక్కడ ఆపద ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని శ్రీ గుమ్మడి శ్రీరామ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మాడుగుల జనసేన పార్టీ నాయకులు రోబ్బా మహేష్, గండెం రాంబాబు, శివాజీ,దయా యాదవ్, కలిపిరెడ్డి రాజా, దాసరి అచ్చుతరావ్, గుమ్మాల నానాజీ, గట్టా రాము, దారబోయిన గణేష్, నారయ్య, కొండలరావు, జామి సత్యారావు, దారాబోయిన భాను ప్రసాద్, తదితర జనసైనికులు పాల్గొని మీకు ఎప్పటికీ మీ వెంట మీకు తోడుగా జనసేన పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చి వెళ్ళారు.