నెట్ ఫ్లిక్స్ లో మహాసముద్రం

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం మహాసముద్రం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతిధి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల అయిన లుక్స్, టీజర్,ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 14 న రిలీజ్ కాబోతుంది.

కాగా తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులపై అధికారిక క్లారిటీ వచ్చేసింది.ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ రైట్స్ ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందట . మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.