మహా సముద్రం థీమ్ పోస్టర్

ఆర్ ఎక్స్100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి తాజాగా శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిస్తున్నచిత్రం ‘మహాసముద్రం’. ఏకే ఎంటర్‌టైన్స్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు దీపావళి సందర్బంగా ఈ సినిమా థీమ్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా సినిమా పై ఆసక్తిని కూడా పెంచింది. ఓ వైపు ప్రేమ, మరోవైపు యుద్ధం.. అనే అర్ధం వచ్చేలా పోస్టర్ డిజైన్ చేశారు. దీనికి ‘అపరిమితమైన ప్రేమ’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజాగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.