పవన్ కళ్యాణ్ ని సీఎం హోదాలో కూర్చోబెట్టడానికి అహర్నిశలు కష్టపడాలని పిలుపునిచ్చిన మహాసేన రాజేష్

అమలాపురం నియోజవర్గం జనసేన నాయకులు లింగోలు పండు ఆహ్వానం మేరకు మహాసేన రాజేష్ అమలాపురం విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు వారి చేస్తున్న ఎనలేని సేవలు రాజేష్ కొనియాడడం జరిగింది. 2024లో పవన్ కళ్యాణ్ ని సీఎం హోదాలో కూర్చోబెట్టాలని నియోజవర్గంలో ప్రతి జనసైనికుడు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కష్టపడి పని అలాగే అమలాపురం సీటును గెలిపించుకుని పవన్ కళ్యాణ్ ని సీఎం హోదాలో కూర్చోబెట్టడానికి అహర్నిశలు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సీనియర్ జనసేన నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు. గన్నవరం నియోజవర్గం సీనియర్ జనసేన నాయకులు కార్యకర్తలు కె.ఎస్.ఎస్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.