జియో 5జీ అంబాసిడర్‌గా మహేష్‌

సోషల్ మీడియా ద్వారా మహేష్ కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే ప్రముఖ ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ ఆప్‌నకు కూడా అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఇపుడు తాజాగా మరో భారీ ఆఫర్ మహేష్ చెంతకు వచ్చిoది. అతిపెద్ద కార్పొరేట్ బ్రాండ్ అయిన రిలయెన్స్ జియోకు కూడా మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నాడట. దీనికి గాను మహేష్‌కు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ లభించబోతోందట. త్వరలో 5జీ విడుదల చేయబోతున్నట్టు జియో ప్రకటించగా… జియోను మరింత ప్రమోట్ చేసేందుకు తెలుగు రీజియన్‌కు సంబంధించి మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడట.