రిలీజ్ డేట్‌తో ‘మేజర్’
మేజర్’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కాగా, రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ నుంచి మరో పాట విడుదలై ఆకట్టుకుంటోంది.
అడివి శేష్ ‘మేజర్’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారైంది. 2022 ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు తెలియజేస్తూ ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ‘120రోజులు షూటింగ్, 8 సెట్లు, 75 లొకేషన్స్, మూడు భాషలు’ అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. శశికిరణ్ తిక్క దర్శకుడు. సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహేశ్‌బాబు, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలై ఈ చిత్ర పోస్టర్లు అభిమానులను సినిమాపై ఆసక్తిని రేకేస్తున్నాయి.