నాగబాబు గారి అనంత జిల్లా పర్యటనను జయప్రదం చేయండి: గౌతమ్ కుమార్

ఉరవకొండ: జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు నాగబాబు అనంత జిల్లా పర్యటనను జయప్రదం చేయాలని జనసేన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ జనసేన శ్రేణులను కోరారు. ఈ అందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లడుతూ.. అనంత జిల్లా పర్యటన జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా. ఉత్సాహాన్ని నింపేందుకు ఈ పర్యటన ఎంతో దోహద పడుతుందని, ప్రజలు జనసేన వైపు చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లేందుకు తీసుకెళ్లేందుకు నాగబాబు గారి సూచనలు ఎంతో లబ్ది చేకూరుతాయని రేపటి రోజున ఉదయం రోడ్లు శ్రమదానం మహిళల మీటింగ్ మధ్యాహ్నాం జిల్లా కార్యకర్తల మీటింగ్ కి ఉరవకొండ నియోజకవర్గం నుంచి నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షలు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉరవకొండ మండలం నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్తామని తెలియచేశారు.