జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజవర్గం: మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జరుగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర పి ఏ సి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంఛార్జి పితాని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో మార్చి 14వ తేదీన మచిలీపట్నంలో జరుగబోయే అవిర్భావ సభకు సంబంధించి ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల కార్యకర్తలతో ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ మార్చి 14న మచిలీపట్నంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయని, ఈ సభకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వీరామహిళలు జనసైనికులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపనిచ్చారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో నియోజకవర్గం లో సుమారు 7800 సభ్యత్వాలు నమోదు సంతోషం అన్నారు.25 కి పైగా క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వాలంటీర్లకు జనసేన పార్టీ నుంచి ప్రత్యేకంగా పాసులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈకార్య క్రమంలో పాల్గొన్న నియోజక వర్గ జనసైనికులు, వాలంటీర్స్ లను పితాని బాలకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో సానబోయిన మల్లికార్జునరావు, జక్కంశెట్టి పండు, గొలకోటి వెంకన్నబాబు, మద్దంశెట్టి పురుషోత్తం, మోకా బాల ప్రసాద్, మచ్చా నాగబాబు, కడలి శీను, ఉండ్రు సత్యనారాయణ, గిడ్డి రత్నశ్రీ, నాతి నాగేశ్వరరావు, పోతాబత్తుల గోవిందరాజు, సుదా శ్రీను, రంబాల చౌదరిబాబు, గొలకోటి పణి, బీమాల సూర్యనారాయణ, సంసాని పాండురంగారావు, పిల్లా గోపి, రాయపురెడ్డి దుర్గాప్రసాద్, ఓలేటి బాబి, రామాయణం మణేశ్వరరావు, కోలా నారాయణరావు మరియు క్రియాశీలక వాలంటీర్లు, మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, జనసైనికులు పెద్ద యెత్తున పాల్గొన్నరు.