యువశక్తి కార్యక్రమానికి ఆహ్వానం.. కాకినాడ సిటీ జనసేన

కాకినాడ సిటీ: జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశానుసారం జనవరి 12వ తారీఖున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుపతలపెట్టిన యువశక్తి బహిరంగ సభకు హాజరు కావాలి అని కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ నాయకత్వంలో కాకినాడ నగర పుర ప్రముఖులను, మహిళలను ముఖ్యంగా యువతీ యువకులను ఆహ్వానించారు. ఈ కర్యక్రమంలో కాకినాడ సిటీ జనసేన కార్యదర్శి వానపల్లి హరికృష్ణ, యువశక్తి కో ఆర్డినేషన్ టీం, సిటీ కమిటీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ ఛార్జ్ లు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.